calender_icon.png 20 January, 2025 | 3:21 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దుబాయ్‌లో మెదక్ జిల్లావాసి మృతి

11-09-2024 02:50:05 AM

మెదక్, సెప్టెంబర్ 10 (విజయక్రాంతి): బతుకుదెరువు కోసం దుబాయ్‌కి వెళ్లిన మెదక్ జిల్లాకు చెందిన ఓ వ్యక్తి మృతిచెందాడు. హవేళీఘణపురం మండలం సుల్తాన్‌పూర్ తండాకు చెందిన రమావత్ వసురాం(40) నెల రోజుల క్రితం ఉపాధి కోసం నిజామాబాద్‌కు చెందిన ఓ ఏజెంట్ ద్వారా దుబాయ్ వెళ్లి ఓ కంపెనీలో చేరాడు. అయితే, గత వారం రోజుల క్రితం కంపెనీ నుంచి బయటకు వచ్చిన వసురాం.. సోమవారం మృతిచెందాడని కుటుంబీకులకు సదరు ఏజెంట్ ద్వారా సమాచారం అందింది. దీంతో వసురాం కుటుంబం ఒక్కసారిగా కన్నీరుమున్నీరయ్యారు. ఉపాధి కోసం దుబాయ్ వెళ్తే శవమయ్యాడని రోదించారు. వసురాం ఎలా చనిపోయాడో అర్థం కావడం లేదని వాపోతున్నారు. తన భర్త మృతదేహాన్ని తీసుకురావడానికి సహకరించాలని వసురాం భార్య విజ్జి అధికారులను, ప్రజాప్రతినిధులను వేడుకుంటోంది.