calender_icon.png 21 March, 2025 | 1:48 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ గా కామారెడ్డి జిల్లా వాసి ఎంపిక

20-03-2025 10:43:22 PM

కామారెడ్డి (విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం టౌన్ ప్లానింగ్ అధికారుల పోస్టుల భర్తీ జాబితాలు ప్రకటించింది. టౌన్ ప్లానింగ్ అధికారిగా కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలం పెద్ద ఏక్లారా గ్రామానికి సాయి కిరణ్ ఎంపికైనట్లు ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ప్రశంస పత్రంతో పాటు జైనింగ్ పత్రం అందుకున్నారు. మారుమూల ప్రాంతమైన జుక్కల్ నియోజకవర్గంలో మద్నూర్ మండలం పెద్ద క్లారతి చెందిన సాయి కిరణ్ ఎంపిక కావడం పట్ల గ్రామస్తుల కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన పరీక్షలో సాయికిరణ్ టౌన్ ప్లానింగ్ అధికారిగా ఎంపికైనట్లు పెద్ద ఏక్లారా గ్రామస్తులు తెలిపారు.