04-03-2025 08:23:32 PM
కామారెడ్డి (విజయక్రాంతి): సదాశివనగర్ మండలానికి చెందిన నరేష్ ఫిబ్రవరి 3న పని నిమిత్తం దుబాయ్ వెళ్లారు ఫిబ్రవరి 24న నరేష్ ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు. ఈ విషయం బీఆర్ఎస్ కార్యకర్తలకు తెలవగానే వెంటనే స్పందించిన మాజీ ఎమ్మెల్యే సురేందర్, ఎమ్మెల్సీ కవితకు సమాచారం ఇచ్చారు. దుబాయ్ నుండి ఇండియాకు వచ్చేంతవరకు పూర్తి ఏర్పాట్లు జరిగేలా చూసుకోవాలని కార్యకర్తలకు సూచించారు. నరేష్ మృతదేహం మంగళవారం గ్రామానికి వచ్చింది చేరుకుంది. మంగళవారం అంత్యక్రియలు నిర్వహిస్తున్నట్లు గ్రామస్తులు తెలిపారు.