వి. రామచంద్రరావు, తాపీ చాణక్యల దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘గంగ మంగ’. ఈ సినిమా 1973 జనవరి 1న విడుదలైంది. హిందీలో వచ్చిన ‘సీతా ఔర్ గీతా’ అనే సినిమాకు రీమేక్‌గా ఈ చిత్రం రూపొందింది. శోభన్‌బాబు, కృష్ణ, వాణిశ్రీ ఈ చిత్రంలో ప్రధాన పాత్రలు పోషించా రు. శ్రీవాణి ద్విపాత్రాభినయం చేశారు.
చిన్నతనంలోనే తల్లిదండ్రు లను కోల్పోయిన గంగ.. భారీ ఆస్తికి వారసురాలు. ఆమె తన మామ, అత్తతో కలిసి నివ సిస్తూ ఉంటుంది. చాలా అమాయకురాలు, పిరికి అమ్మాయి. ప్రతి నెలా వారి కుటుంబ న్యాయవాది వారి ఇంటికి వచ్చి గంగకు కొంత డబ్బు అందజేస్తాడు. కానీ గంగ అత్త దుర్గ దానిని బలవంతంగా తీసుకుని ఇంటి పనంతా చేయిస్తూ ఉంటుంది.
మరోవై పు మంగ చిన్న గుడిసెలో తల్లితో కలిసి జీవిస్తూ ఉంటుంది. చాలా చలాకీగా సంతోషకరమైన జీవితాన్ని మంగ గడుపుతూ ఉంటుంది. వీధిలో మేజిక్ చేస్తూ చాలా సంతోషంగా జీవనం సాగిస్తుంది. ఇలా రెండు విభిన్న ప్రాంతాల్లో విభిన్న పరిస్థితుల మధ్య ఒకే పోలికతో పెరుగుతున్న ఇద్దరు అమ్మాయిల కథ ఆ తరువాత ఎలాంటి మలుపు తీసుకుందనేది చిత్ర కథాంశం.