calender_icon.png 7 October, 2024 | 8:51 PM

పాల్ పోగ్బాకు ఊరట

06-10-2024 12:00:00 AM

నిషేధం 18 నెలలకు తగ్గింపు

లండన్: ఫ్రాన్స్ స్టార్ ఫుట్‌బాలర్ పాల్ పోగ్బాకు ఊరట లభించింది. తనపై ఇటలీ యాంటీ డోపింగ్ కోర్టు విధించిన నిషేధాన్ని సవాల్ చేస్తూ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్ (కాస్)లో అప్పీల్ చేసుకున్న పోగ్బాకు తీర్పు అనుకూలంగా వచ్చింది. నిషేధాన్ని 4 సంవత్సరాల నుంచి 18 నెలలకు తగ్గిస్తూ కాస్ తీర్పునిచ్చింది.

దీంతో వచ్చే ఏడాది మార్చి నుంచి పోగ్బా తన ఫుట్‌బాల్ కెరీర్‌ను తిరిగి ఆరంభించే అవకాశముంది. ‘ఒక పీడకల ముగిసింది.. కాస్ తీర్పును స్వాగతిస్తూ కలను నిజం చేసుకునేందుకు నా జర్నీని తిరిగి ఆరంభించబోతున్నా’ అని పాల్ పోగ్బా తన సంతోషాన్ని పంచుకున్నాడు.

కాగా గతేడాది ఆగస్టులో పోగ్బా టెస్టోస్టిరోన్ టెస్టులో పాజిటివ్‌గా తేలడంతో ఇటలీ యాంటీ డోపింగ్ కోర్టు అతడిపై నాలుగేళ్ల నిషేధం విధించింది. 2013లో ఫ్రాన్స్ తరఫున అంతర్జాతీయ ఫుట్‌బాల్ కెరీర్ ఆరంభించిన పోగ్బా 91 మ్యాచ్‌లాడి 11 గోల్స్ సాధించాడు. 2018లో ఫిఫా వరల్డ్‌కప్ నెగ్గిన ఫ్రాన్స్ జట్టులో సభ్యుడిగా ఉన్నాడు. కెరీర్‌లో ఆట కంటే గాయాలే ఎక్కువగా ఉన్నప్పటికీ పోగ్బా స్టార్ ప్లేయర్‌గానే గుర్తింపు పొందాడు.