calender_icon.png 12 January, 2025 | 4:25 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అల్లు అర్జున్‌కు ఊరట

12-01-2025 01:34:26 AM

* ఆదివారం హాజరుకు మినహాయింపు

* విదేశాలకు వెళ్లేందుకూ నాంపల్లి కోర్టు అనుమతి

హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 11 (విజయక్రాంతి): సినీ నటుడు అల్లు అర్జున్‌కు నాంపల్లి కోర్టులో ఊరట లభించింది. రెండు నెలలపాటు ప్రతి ఆదివారం చిక్కడపల్లి ఠాణాలో విచారణకు హాజరు కావాలనే నిబంధన తొలగించింది. కోర్టు ఆదేశాల మేరకు అల్లు అర్జున్ గత ఆదివారం చిక్కడపల్లి పీఎస్‌కు హాజరయ్యారు.

ఈ సమయంలో సెక్యూరిటీ సమస్యలు తలెత్తుతున్న కారణంగా సెక్యూరిటీ కోణంలో తనకు ప్రతి ఆదివారం విచారణకు హజరయ్యే విష యంలో మినహాయింపు ఇవ్వాలని కోర్టును కోరారు. ఇప్పటికే మధ్యంతర బెయిల్ నుంచి పూర్తిస్థాయి బెయిల్ మంజూరు, కోర్టు ఆదేశాల మేరకు రూ.50 వేల రెండు పూచీకత్తు బాండ్ల ను కోర్టుకు సమర్పించారు.

ఈ క్రమం లో విదేశాలకు వెళ్లి రావడానికి కూడా అనుమతించాలని కోరగా, అందుకు కోర్టు అంగీకరించింది. డిసెంబర్ 4న రాత్రి సంధ్య థియేటర్‌లో తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మరణించ డం తోపాటు ఆమె కొడుకు ప్రాణాపాయస్థితిలో చికిత్స పొందుతున్నాడు. ఈ కేసులో పోలీసులు అల్లు అర్జున్‌ను సైతం ఏ11గా చేర్చారు.