calender_icon.png 7 April, 2025 | 8:22 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వేసవి కానుకగా ఎర్రచీర

06-04-2025 12:11:11 AM

బేబీ డమరి సమర్పణలో శ్రీపద్మాయల ఎంటర్‌టైన్ మెంట్స్, శ్రీసుమన్ వెంకటాద్రి ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ‘ఎర్రచీర ది బిగినింగ్’. ఈ సినిమాలో ప్రముఖ నటుడు రాజేంద్రప్రసాద్ మనవరాలు బేబీ సాయి తేజస్విని నటిస్తుండగా, దర్శకుడు సుమన్‌బాబు స్వీయ దర్శకత్వంలో ఒక కీలక పాత్రలో కనిపించనున్నారు. శ్రీరా మ్, కమల్ కామరాజు, కారుణ్య చౌదరి, అయ్యప్ప పి శర్మ, సురేశ్ కొండేటి, రఘుబాబు వివిధ ముఖ్యపాత్రలు పోషించారు.

మదర్ సెంటిమెంట్, హారర్, యాక్షన్ అంశాలతో కూడిన ఈ చిత్రాన్ని తొలుత మహాశివరాత్రి కానుకగా విడు దల చేయాలని భావించారు మేకర్స్. అయితే, సాంకేతిక కారణాల వల్ల రిలీజ్ వాయిదా పడింది. ఇప్పుడు వేసవి కానుకగా ఏప్రిల్ 25న విడుదల చేసేందుకు చిత్రబృందం సన్నాహాలు చేస్తోంది.

ఈ మేరకు నిర్మాతల్లో ఒకరైన ఎన్‌వీవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ.. ‘ఈ చిత్రంలో క్ల్లుమాక్స్ ఎపిసోడ్, అఘోరాలతో శివుడి సీక్వెన్స్ అద్భుతంగా వచ్చిం ది’ అన్నారు. ఈ చిత్రానికి డీవోపీ: చందు; బీజీఎం: ఎస్ చిన్న; మ్యూజిక్: ప్రమోద్ పులిగిల్ల; డైలాగ్స్: గోపి విమల పుత్ర; స్టంట్స్: నందు; ఎడిటర్: వెంకట ప్రభు.