calender_icon.png 24 September, 2024 | 3:57 AM

కబ్జా కోరల్లో ఎర్రచెరువు

24-09-2024 01:47:53 AM

10 ఎకరాల్లో 2 ఎకరాలు మాయం

భద్రాద్రి కొత్తగూడెం, సెప్టెంబర్ 23(విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండల పరిధిలోని నాగారం కాలనీలో ఉన్న ఎర్రచెరువు ఆక్రమణకు గురవుతున్నది. 100 ఎకరాల లోపు గల చెరువుల జాబితాలో ఈ చెరువు ఉంది. ఈ చెరువు విస్తీర్ణం 10 ఎకరాలు, ఆయకుట్ట సుమారు 50 నుంచి 55 ఎకరాల వరకు ఉంటుంది. రోడ్డును ఆనుకుని చెరువు ఉండటంతో అక్రమార్కుల కళ్లు పడ్డాయి. సుమారు 2 నుంచి 2.20 ఎకరాల వరకు ఆక్రమించి, మట్టి పోసి ఎండు గడ్డి నిల్వ చేయడం, ఇళ్ల నిర్మాణం చేపట్టినట్టు తెలుస్తున్నది. దీంతో చెరువలో నీటి నిల్వ సామర్థ్యం తగ్గి  పంటలకు తడి అందక ఎండిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంమై నీటిపారుదశాఖ  డీఈ రాణిని వివరణ కోరగా.. చెరువు ఆక్రమణకు గురైనట్లు తన దృష్టికి రాలేదని వెంటనే క్షేత్రస్థాయి పరిశీలన చేసి ఆక్రమణ జరిగినట్లు తెలిస్తే చర్యలు తీసుకుంటామన్నారు.