- 'విజయక్రాంతి' చెప్పిన అంశాన్నే.. ట్వీట్ చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
- రైతాంగానికి సీఎం అభినందనలు
హైదరాబాద్, నవంబర్ 17 (విజయక్రాంతి): కాళేశ్వరం లేకున్నా ఈ ఏడాది వానకాలంలో రికార్డు స్థాయిలో ధాన్యం దిగుబడిని సాధించామని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. దీంతో కాళేశ్వరం వల్లే తెలంగాణలో వరి సాగు పెరిగిందన్న బీఆర్‌ఎస్ తప్పుడు ప్రచారం పటాపంచ లైందని ట్వీట్ చేశారు.
కాళేశ్వరం లేకున్నా సాగు బాగు అంటూ ఆదివారం విజయక్రాంతిలో కథనం ప్రచురమైంది. ఆ కథనంలోని సారాంశాన్ని సీఎం రేవంత్‌రెడ్డి తన ట్వీట్ ద్వారా వెల్లడించారు. కాళేశ్వరంలో భాగమైన మేడిగడ్డ కుంగినా.. నీటిని నిల్వ చేసే పరిస్థితి లేకపోయినా..
రికార్డు స్థాయిలో వరిధాన్యం పండిందన్నారు. ఇది తెలంగాణ రైతుల ఘనత అన్నారు. రైతుల శ్రమ, చెమట ఫలితంగానే ఇది సాధ్యమైందన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర రైతాంగాన్ని ఆయన అభినందించారు.