calender_icon.png 15 April, 2025 | 4:57 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

లబ్ధిదారులకు రసీదు తప్పనిసరిగా ఇవ్వాలి

11-04-2025 12:26:41 AM

  1. జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి

నల్లచెరువు ట్యాంక్ బండ్ సందర్శన

ఎస్సీ, బీసీ బాలికల వసతి గృహాల సందర్శన

వనపర్తి టౌన్, ఏప్రిల్ 10 : రేషన్ దుకాణాల్లో తప్పనిసరిగా బియ్యం నిల్వకు సంబంధించి రిజిస్టర్ నిర్వహించడమే కాకుండా, రేషన్ కార్డుదారులు సన్న బియ్యం తీసుకున్న తర్వాత వారికి తప్పనిసరిగా రసీదు ఇవ్వాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు.  గురువారం జిల్లా కలెక్టర్ వనపర్తి జిల్లా కేంద్రంలోని బండార్ నగర్ లో ఉన్న 19వ నెంబర్ రేషన్ దుకాణాన్ని ఆకస్మికంగా సందర్శించారు.

రేషన్ కార్డుదారులకు సన్న బియ్యం పంపిణీపై డీలర్ తో ఆరా తీశారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ రేషన్ దుకాణాల్లో తప్పనిసరిగా బియ్యం నిల్వకు సంబంధించి రిజిస్టర్ నిర్వహించడమే కాకుండా, రేషన్ కార్డుదారులు సన్న బియ్యం తీసుకున్న తర్వాత వారికి తప్పనిసరిగా రసీదు ఇవ్వాలని సూచించారు.  పేదలకు నాణ్యమైన సన్న బియ్యం అందించాలనే ఉద్దేశంతోనే, ప్రభుత్వం తెల్ల రేషన్ కార్డుదారులకు సన్న బియ్యం పంపిణీ ప్రారంభించిందని, కాబట్టి పకడ్బందీగా పేదలకు సన్న బియ్యం ఇవ్వాలని చెప్పారు.   

నల్లచెరువు ట్యాంక్ బండ్ సందర్శన

నల్ల చెరువు ట్యాంకుబండ్ సుందరీకరణ పనులు వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. చెరువు కట్టపై ఏర్పాటు చేయనున్న వాకింగ్ ట్రాక్ పై మొక్కలు రెండు మూ డు రోజుల్లో నాటాలని సూచించారు. అదేవిధంగా కొత్తగా ఏర్పాటు చేసిన ఓపెన్ జిమ్ దగ్గర సీసీ కెమెరాలు అమర్చాలని మున్సిపల్ కమిషనర్ కు సూచించారు.

ఓపెన్ జిమ్ మీదుగా వెళ్ళిన విద్యుత్తు లైను పక్కకు అమర్చే విధంగా చర్య లు తీసుకోవాలని ఆదేశించారు. పిల్లలకి ఇబ్బంది లేకుండా చుట్టూ ఫెన్సింగ్ తో పాటు, విద్యుత్ స్తంభాలకు లైట్లు కూడా ఏర్పాటు చేయాలని చెప్పారు. 

ఎస్సీ, బీసీ బాలికల వసతి గృహాల సందర్శన

జిల్లా కేంద్రంలోని పీర్లగుట్టలో ఉన్న షెడ్యూల్ కులాల బాలికల వసతి గృహాలను కలెక్టర్ సందర్శించారు. పోస్ట్ మెట్రిక్ వసతి గృహంలో ఉన్న సమస్యలను తెలుసుకున్నారు. అక్కడే ఉన్న ప్రిమెట్రిక్ హాస్టల్ ను కూడా సందర్శించి భవనంలో విద్యార్థుల వసతి సామర్థ్యంపై ఆరా తీశారు. అదే ప్రాం గణంలో నూతన భవన నిర్మాణానికి సంబంధించి పూర్తి వివరాలతో నివేదిక ఇవ్వాలని పంచాయతీ రాజ్ డిఈకి సూచిం చారు.

అనంతరం కేటీఆర్ నగర్ లో ఉన్న ఎస్సీ బాలుర వసతి గృహాన్ని సందర్శించి మరమ్మతులు చేయడానికి అవకాశం ఉందా అనే విషయంపై నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. అదేవిధంగా, బసవన్న గడ్డలో ఉన్న బీసీ బాలికల వసతి గృహాన్ని కలెక్టర్ పరిశీలించారు. అక్కడ విద్యార్థులకు వసతి విషయంలో ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అని విద్యార్థులతో మాట్లాడి తెలుసుకున్నారు.

జిల్లా పౌర సంబంధాల అధికారి కాశీ విశ్వనాథ్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ మల్లికార్జున్, తహసిల్దార్ రమేష్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు, ఇతర అధికారులు, తదితరులు కలెక్టర్ వెంట ఉన్నారు.