19-03-2025 07:21:44 PM
న్యాయమూర్తి కీర్తి చంద్రిక రెడ్డి..
ఇల్లెందు (విజయక్రాంతి): అంతర్జాతీయ వినియోగదారుల హక్కుల దినోత్సవాన్ని పురస్కరించుకొని బుధవారం ఇల్లందు కరెంట్ ఆఫీస్ లో గల ప్రభుత్వ ట్రైబల్ వెల్ఫేర్ బాలికల వసతి గృహం నందు ఇల్లందు మండల న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో న్యాయ చైతన్య సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఇల్లందు ప్రిన్సిపాల్ జూనియర్ సివిల్ జడ్జి దేవరపల్లి కీర్తి చంద్రిక రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై వినియోగదారుల హక్కులు, బాధ్యతలు గురించి వివరించినారు.
ముఖ్యంగా వినియోగదారులు ఏ వస్తువు కొన్న తప్పనిసరిగా రసీదు తీసుకోవాలని, ప్రతి వస్తువుపై తయారీ తేదీ, ముగింపు తేదీ చూసుకోవాలని, ఆన్లైన్లో మోసాలు జరుగుతున్నందున ఆన్లైన్ వస్తువులపై కూడా రసీదు తీసుకోవాలని తెలిపారు. రసీదు తీసుకోవడం వలన మనకు జరిగిన నష్టాన్ని కన్జ్యూమర్ ఫోరంలో కేసు వేసి కంపెనీ దారులపై చర్యలు తీసుకొని నష్టపరిహారం పొందవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇల్లందు బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి కె. ఉమామహేశ్వరరావు, హాస్టల్ వార్డెన్ విద్యార్థినిలు, కోర్టు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.