calender_icon.png 3 April, 2025 | 3:50 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సన్న బియ్యం పంపిణీతో పేదలకు అసలైన పండుగ

02-04-2025 12:31:10 AM

కొండాపూర్, ఏప్రిల్ 01: కొండాపూర్ మండల కేంద్రంలో  ఉగాది , రంజాన్ కానుకగా పేదలకు ఉచిత  సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు . మంగళవారం మండల కేంద్రమైన కొండాపూర్ లో సన్న బియ్యం పంపిణీ కార్యక్రమం ను ప్రారంభించారు. 

ఆత్మ కమిటీ చైర్మన్, మండల అధ్యక్షుడు వై ప్రభు మాట్లాడుతూ గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం పదేళ్ల అధికారంలో ఉండి రేషన్ కార్డులపై సన్న బియ్యం ఇస్తామని ప్రకటనలకే పరిమితమైతే.. కాంగ్రెస్ అధికారంలో వచ్చిన 15 నెలలోనే ఆచరణలో చేసి చూపిస్తోందని పేర్కొన్నారు.

ప్రస్తుతం దొడ్డు బియ్యం స్థానంలో ఏప్రిల్ ఒకటో తారీకు నుండి సన్న బియ్యం పంపిణీ చేస్తున్నడంతో రాష్ట్ర ప్రభుత్వ ఖజానాపై రూ.2858 కోట్లు అదనపు భారం పడుతుంది. ఎంత భారం అయినా ప్రజల కోసమే ఈ ప్రజా ప్రభుత్వం.. అని తెలిపారు.

సంక్షేమం అభివృద్ధి సమపాళ్యం అందించడం కాంగ్రెస్ వల్లే సాధ్యమని శ్రీమంతులే కాదు పేదలు కూడా సన్న బియ్యం తినాలని ప్రజా ప్రభుత్వం ఆకాంక్ష అదే ఇందిరమ్మ రాజ్యం అన్నారు.  ఈ కార్యక్రమంలో  కొండాపూర్ మాజీ ఎంపిటిసి నర్సింహారెడ్డి, ఆత్మ కమిటీ డైరెక్టర్ రాజు,  నర్సింలు ,జయరాములు డీలర్ రాజు ,గోపాల్  గ్రామ ప్రజలు పాల్గొన్నారు.