25-02-2025 01:45:42 AM
ప్రత్యేకంగా ఉత్తర కాశి ర్యాట్ మైనర్స్ బృందాన్ని రంగంలోకి దింపి కార్మికుల జాడ కనిపెట్టేందుకు ప్రయత్నిస్తున్నది. బృందం గాలింపు చర్యలకు ‘ఆక్వాఐ’ అనే సాంకేతికతను వినియోగిస్తున్నది. కార్మికుల ఆచూకీ వెతికేందుకు యాంజియోగ్రఫీ కెమెరాను వినియోగిస్తున్నది. అంతకుముందు నీటి ఊటను డీ వాటరింగ్ చేసేందుకు పొక్లెయిన్లను సైతం పంపించింది. ఎస్డీఆర్‌ఎఫ్, ఎన్‌డీఆర్‌ఎఫ్, ఆర్మీ, హైడ్రా, ఝార్ఖం డ్ మైనింగ్, ఐఐటీ మద్రాస్, సింగరేణి రెస్క్యూ బృందాలు కూడా ఈ రెస్క్యూ ఆపరేషన్‌లో భాగస్వాములవుతున్నాయి.
సొరంగ మార్గంలోని 14వ కిలోమీటర్ వద్ద మూడు మీటర్ల ప్రాం తంలో మట్టిదిబ్బలు కూలి టన్నెల్ బోరింగ్ మెషిన్ వెనుక కార్మికులు శనివారం చిక్కుకున్నారని రెస్క్యూ టీం ప్రాథమికంగా గుర్తించింది. బృం దం ఇప్పటివరకు 12వ కిలోమీటర్ వరకు వెళ్లగలిగింది. కానీ.. ఆ ప్రాం తంలో నీటి ఊట, బురద పెద్ద సవాల్‌గా మారింది. సొరంగంలో ప్రస్తు తం 200 మీటర్ల మేర బురద పేరుకుపోయింది. తొలుత ర్యాట్ మైనర్స్ రెస్క్యూ బృందాన్ని నేరుగా సొరంగంలోకి పంపాలని సర్కార్ ప్రణాళిక రచించింది.
కానీ.. మట్టిదిబ్బలు కూలి కిందపడుతుండడంతో బృందం ఆ ప్రయత్నాలను విరమించుకున్నది. కార్మికుల వద్దకు స్నిఫర్ డాగ్స్‌ను సైతం పంపించాలని బృందం యత్నించింది. ఆ ప్రయత్నాలు సైతం ఫలించలేదు. ప్రస్తుతం కన్వేయర్ బెల్ట్‌ను వినియోగించి బురదను బయటకు పంపించే ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయి. బృందం ప్రతి ఆరు గంటలకోసారి సొరంగంలోని ప్రమాద స్థలికి వెళ్లేందుకు యత్నిస్తు న్నారు. బృందం ఇప్పటివరకు ఏడు సార్లు సొరంగంలోకి వెళ్లేందుకు యత్నించి, మళ్లీ వెనక్కివచ్చింది.
ప్రస్తుతం రెస్క్యూ ఆపరేషన్‌లో 584 మంది నిపుణులు పాల్గొంటున్నారు. కార్మికుల ఆచూకీ కోసం డ్రోన్లు, ఎండోస్కోపిక్ కెమెరాలు, వాకీటాకీలను వినియోగిస్తున్నారు. మరోవైపు సొరంగంలో చిక్కుకున్న కార్మికుల కుటుంబ సభ్యులు ప్రమాద స్థలికి చేరుకున్నారు. తమవారికి ఏమవుతుందోనని ఆందో ళన చెందుతున్నారు.