calender_icon.png 17 October, 2024 | 8:01 AM

ప్రయాణికుడి భోజనంలో ఎలుక

17-10-2024 01:05:02 AM

విమానం అత్యవసర ల్యాండింగ్

న్యూఢిల్లీ, అక్టోబర్ 16: ఇటీవల నార్వే రాజధాని ఓస్లో నుంచి స్పెయిన్‌లోని మలాగాకు వెళ్తున్న స్కాండినేవియన్ ఎయిర్‌లైన్స్ విమానంలో.. ప్రయాణికులకు అందించిన మీల్స్‌లో ఓ బతికున్న ఎలుక కనిపించడంతో వారు షాక్‌కు గురయ్యారు. ఎలుక ఒక్కసారిగా మీల్ కంటైనర్ నుంచి బయటకి దూకడంతో విమానంలో కలకలం రేపింది.

ఒకవేళ అదే ఎలుక విమానంలోని ఎలక్ట్రికల్ వైరింగ్ తదితర వస్తువలను కొరికేసి ఉంటే పరిస్థితి ఏంటని ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేశారు. అప్రమత్తమైన ప్లేన్ సిబ్బంది కోపెన్ హగన్‌లో విమానాన్ని అత్యవసర ల్యాండింగ్ చేసింది.

అక్కడ సిబ్బంది ఎలుకను వెతికే పనిలో ఉండగా వేరే విమానంలో ప్రయాణికులను మలాగాకు పంపించారు. ఈ ఘటనపై ఫ్రాంక్‌ఫిన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎయిర్  ట్రైనింగ్‌లో గ్రాడ్యుయేట్ అయిన సురశ్రీ బసక్ మాట్లాడుతూ.. ‘ఇలాంటి చర్యలను నివారించడానికి ఆహార తయారీ సంస్థపై కఠిన చర్యలు తీసుకుంటాం’ అని స్పష్టం చేశారు.