calender_icon.png 12 January, 2025 | 3:32 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

టీఎక్స్ ఆసుపత్రిలో అరుదైన చికిత్స

15-09-2024 03:08:12 AM

హైదరాబాద్ సిటీబ్యూరో, సెప్టెంబర్ 14 (విజయక్రాంతి): ఆధునిక వైద్య శాస్త్రంలో మరో ముందడుగు పడింది. నగరలోని టీఎక్స్ ఆసుపత్రిలో అరుదైన మెదడు శస్త్ర చికిత్సను వైద్యులు విజయవంతంగా పూర్తిచేశారు. న్యూరో సర్జన్ డాక్టర్ గజ్జల నరేష్‌కుమార్ నేతృత్వంలోని వైద్య బృందం ‘అవేక్ క్రానియోటమీ’ పద్ధతి ద్వారా 26 ఏళ్ల యువకుడికి సర్జరీ చేసి మెదడులో ఏర్పడిన ట్యూమర్‌ను తొలగించి అతడి ప్రాణాలు కాపాడారు. డాక్టర్ కీర్తికర్ రెడ్డి, డాక్టర్ దీపక్‌రాజు, రవీంద్ర రెడ్డి మేనేజ్‌మెంట్ బృందం సహకారంతో శస్త్ర చికిత్స విజయవంతంగా పూర్తిచేశామని డాక్టర్ నరేష్‌కుమార్, టీఎక్స్ గ్రూప్ ఆసుపత్రుల చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ శ్రీకాంత్ వోడ్నాల తెలిపారు.