బయోనిక్ గోల్డ్ ఇంప్లాంట్ సాయంతో మోకాలి పాక్షిక రీసర్ఫేసింగ్
హైదరాబాద్ సిటీబ్యూరో, సెప్టెంబర్ 27 (విజయక్రాంతి): గచ్చిబౌలిలోని ఒమెగా హాస్పిటల్ వైద్యులు తెలుగు రాష్ట్రాల్లోనే తొలిసారి బయోనిక్ గోల్డ్ ఇంప్లాంట్ ఉపయోగించి మోకాలి పాక్షిక రీసర్ఫేసింగ్ చికిత్స చేసినట్లు శుక్రవారం ఆర్థోపెడిక్ క్లినికల్ డైరెక్టర్ డాక్టర్ ఆదిత్యకపూర్ తెలిపారు. సంవత్సరం క్రితం స్ట్రోక్‌కు బారిన పడి కొలుకున్న 62 ఏళ్ల వృద్ధురాలికి చిన్న కోత ద్వారా పాక్షిక మోకాలి మార్పిడి చికిత్స చేశామన్నారు. శరీరంలో మెటల్ అలెర్జీలను అరికట్టాలనే ముఖ్యఉద్దేశంతో ఈ ఇంప్లాంట్‌ను తయారు చేశామన్నారు.