ముంబై: భారత దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ చిన్ననాటి గురువు రమాకాంత్ అచ్రేకర్‌కు అరుదైన గౌరవం దక్కింది. ముంబైలోని శివాజీ పార్క్‌లో రమాకాంత్ విగ్రహం నెలకొల్పాలని మహారాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. శివాజీ పార్క్‌లోని గేట్ నంబర్ 5 వద్ద అచ్రేకర్ ఆరు అడుగుల ఎత్తు గల విగ్రహాన్ని ప్రతిష్టించాలని అర్బన్ డెవలప్‌మెంట్ డిపా ర్ట్‌మెంట్ నిర్ణయించింది. దీని నిర్వహణ బాధ్యతలను వి కామత్ మెమోరియల్ క్రికెట్ క్లబ్‌కు అప్పగించారు. అయితే ప్రభు త్వం మాత్రం ఎలాంటి ఆర్థిక సాయం అందించదు. కాగా అచ్రేకర్ విగ్రహ ఏర్పాటుకు అనుమతించిన మహారాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని సచిన్ స్వాగతించాడు. ‘అచ్రేకర్ సార్ కేవలం నా జీవితాన్ని మాత్రమే కాకు ండా ఇంకా ఎంతో మంది విద్యార్థుల జీవితాలను తీర్చిదిద్దాడు’ అని సచిన్ టెండూల్కర్ అన్నాడు.