ముంబై: భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్‌కు బీసీసీఐ అరుదైన గౌరవం కల్పించింది. అంతర్జాతీయ క్రికెట్‌లో లెక్కలేనన్ని రికార్డులు నెలకొల్పిన సచిన్ బీసీసీఐ లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ అవార్డును అందుకోనున్నాడు. శనివారం జరిగిన బోర్డ్ వార్షిక సమావేశం లో అవార్డులను ప్రకటించారు.
51 ఏళ్ల సచిన్ భారత్ తరఫున 664 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడి టెస్టులు, వన్డేల్లో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా రికార్డులకెక్కాడు. ఇక మెన్స్ బెస్ట్ క్రికెటర్‌గా బుమ్రా ఎంపికవ్వగా.. వుమెన్ బెస్ట్ క్రికెటర్‌గా మంధాన నిలిచింది. క్రికెట్‌కు వీడ్కోలు పలికిన అశ్విన్‌ను స్పెషల్ అవార్డుకు ఎంపిక చేయగా.. ముంబై బ్యాటర్ సర్ఫరాజ్ ఉత్తమ డెబ్యూ క్రికెటర్ అవార్డు అందుకోనున్నాడు.