కోల్‌కతా: భారత మాజీ క్రికెటర్ జులన్ గోస్వామికి అరుదైన గౌరవం దక్కింది. కోల్‌కతాలోని ప్రఖ్యాత ఈడెన్ గార్డెన్స్ స్టేడి యంలోని బి స్టాండ్‌కు జులన్ పేరును పెట్టనున్నట్లు బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ (కాబ్) తెలిపింది. ఈ మేరకు కాబ్ అపెక్స్ కౌన్సిల్‌కు ప్రపోజల్ పంపింది. అపెక్స్ కౌన్సిల్ ఆమోదం పొందితే వచ్చే ఏడాది జనవరి 22న భారత్, ఇంగ్లండ్ మధ్య జరగనున్న టీ20 మ్యాచ్ సందర్భంగా జులన్ గోస్వామి పేరిట స్టాండ్‌ను ఆవిష్కరించే అవకాశముంది.
టీమిండియా తరఫున జులన్ గోస్వామి 12 టెస్టులు, 204 వన్డేలు, 68 టీ20ల్లో ప్రాతినిధ్యం వహించింది. మొత్తంగా 355 వికెట్లతో (మూడు ఫార్మాట్లు) అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్‌గా రికార్డులకెక్కింది. ఇప్పటి వరకు ఈడెన్ గార్డెన్‌లోని స్టాండ్స్‌కు మాజీ క్రికెటర్ గంగూలీతో పాటు పంకజ్ రాయ్, బీసీసీఐ మాజీ అధ్యక్షుడు దివంగత జగన్మోహన్ దాల్మియా పేర్లు పెట్టారు.