calender_icon.png 2 November, 2024 | 5:05 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్యారిస్ ఒలింపిక్స్‌లో హిందీకి అరుదైన గౌరవం

28-07-2024 04:05:15 AM

ప్యారిస్, జూలై 27: ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్‌లోని సెన్ నదిపై శుక్రవారం అట్టహాసంగా ఒలింపిక్ క్రీడల ప్రారంభోత్సవం జరిగింది. వేడుకల్లో హిందీకి అరుదైన గౌరవం దక్కింది. అక్కడ ప్రదర్శించిన ఫ్లెక్సీలు, హోర్డింగ్స్‌లో నిర్వాహకులు ఆరు భాషలను వినియోగించగా, వాటిలో హిందీ ఒకటి. ‘సిస్టర్ హుడ్’ పేరిట ఫ్రాన్స్ అందించిన సేవలకు నివాళి ఇస్తూ ప్రదర్శించిన ఇన్ఫోగ్రాఫిక్స్‌లోనూ హిందీకి చోటు దక్కింది. ఫ్రాన్స్‌తో భారత్‌కు ఉన్న బలమైన దౌత్య సంబంధాలకు హిందీని వినియోగించడమే నిదర్శనమని నెటిజన్లు కొనియాడుతున్నారు. నది వేదికగా ఒలింపిక్స్ సంబురాలు జరగడం చరిత్రలో ఇదే తొలిసారి. ఆరుకిలోమీటర్ల మేర జరిగిన పరేడ్‌లో మొత్తం 85 బోట్లలో 6,800 మంది అథ్లెట్లు పాల్గొన్నారు. ఫ్రెంచ్ అక్షర క్రమంలో 85వ క్రీడా బృందంగా భారత్ క్రీడాకారులు పరేడ్‌లో పాల్గొన్నారు. బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు, టెబుల్ టెన్నిస్ దిగ్గజం శరత్ కమల్ పతాకధారులుగా వ్యవహరించారు.