ప్రశంసిస్తూ ప్రధాని మోదీ లేఖ
నిర్మల్, ఫిబ్రవరి 8 (విజయక్రాంతి): ఆసిఫాబాద్ జిల్లా కెరిమెరి మండలానికి చెందిన హర్షిత నిర్మల్ పట్టణంలోని సోఫి గురుకుల పాఠశాలలో పదో తరగతి చదువుతున్నది. హర్షితకు అరుదైన గౌరవం దక్కిం గతేడాది గుజరాత్‌లో సెప్టెంబరులో నిర్వహించిన జాతీయ స్థాయి ప్రేరణ సద కార్యక్రమంలో తెలంగాణ తరఫున ఏకైక విద్యార్థిగా హర్షిత పాల్గొంది.
ఆ సదస్సులో ప్రయోగాత్మక నైపుణ్యాభి వృద్ధి భారత నిర్మాణంలో ఐదు మౌలిక సూత్రాలపై ప్రజేంటేషన్ ఇచ్చింది. ప్రేరణలో పాల్గొని జాతీయస్థాయిలో మంచి గుర్తింపు తెచ్చు కున్న హర్షిత ప్రతిభను గుర్తించిన ప్రధాని నరేంద్ర మోదీ హర్షితకు ప్రత్యేకంగా అభినందనలు తెలుపుతూ లేఖ రాయడం విశేషం. ఈ లేఖ శనివారం పాఠశాలకు చేరుకోవడంతో ఉపాధ్యాయులు, విద్యార్థులు సంతోషం వ్యక్తం చేశారు.