calender_icon.png 24 February, 2025 | 5:06 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రంగంపేటకు రైల్వేస్టేషన్ మంజూరు చేయించాలి

19-02-2025 12:02:11 AM

ఎంపీని కోరిన రామారెడ్డి మండల కాంగ్రెస్ నాయకులు

కామారెడ్డి, ఫిబ్రవరి 18 (విజయ క్రాంతి): రామారెడ్డి మండల మాజీ జడ్పిటిసి, జిల్లా పరిషత్ మాజీ ఫ్లోర్ లీడర్ నారెడ్డి మోహన్‌రెడ్డి ఆధ్వ ర్యంలో మంగళవారం జైరాబాద్ పార్లమెంట్ సభ్యులు సురేష్ షెట్కార్ ను కలిసి రంగంపేటలో రైల్వే స్టేషన్ ఏర్పాటుకు కృషి చేయాలని కోరా రు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు గీరెడ్డి మహేందర్ రెడ్డి,  జహీరాబాద్ పార్లమెంట్ సభ్యులు సురేష్ శేట్కర్‌ను కలిసి రంగంపేటలో రైల్వే స్టేషన్ నిర్మాణం కొరకు కృషి చేయాలని కోరారు.

గతంలో 2019 డిసెంబర్ నెలలో అప్పటి జిఎం గజానన్ మాల్యా దృష్టికి స్థానిక నాయకుడు అనీఫ్ మహమ్మద్ తోపాటు గీరెడ్డి మహేందర్ రెడ్డి, స్థానిక నాయకులు కలిసి ముఖ్యమంత్రివర్యులు రేవంత్ రెడ్డి కి  మల్కాజ్గిరి ఎంపీగా ఉన్నపుడు వారి లెటర్ తీసుకువచ్చి ఇవ్వడం జరిగిందన్నారు.

రంగంపేటలో రైల్వే స్టేషన్ ఏర్పాటు చేయడం ద్వారా పోసానిపేట్, గొల్లపల్లి, ఇస్రాజి వాడి, అడ్లూరు ఎల్లారెడ్డి, మర్కల్, తదితర గ్రామాల నుండి రైతులు వారు పండించినటువంటి పంటలను ఉదయం పట్టణాలకు తీసుకువెళ్లి విక్రయాలు చేసుకొని తిరుగు ప్రయాణం చేసే వీలుంటుందని ఎంపీకి తెలిపారు.

అంతేకాకుండా చదువుకునే విద్యార్థులకు ఎంతో రైల్వే ప్రయాణం సౌకర్యంగా ఉంటుందని తెలిపారు. గీరెడ్డి మహేందర్ రెడ్డి మాట్లాడుతూ  వెనుకబడిన ఎల్లారెడ్డి నియోజకవర్గంలో రంగంపేటలో రైల్వే స్టేషన్ నిర్మించి ఈ ప్రాంత ప్రజలకు మేలు చేయాలని వారు కోరారు. ఈ సందర్భంగా ఎంపీ సురేష్ షెట్కర్ సానుకూలంగా స్పందించినట్లు వారు తెలిపారు.