18-03-2025 12:00:00 AM
అల్లరి నరేశ్ బోల్డ్, నాని కాసరగడ కాంబోలో ఓ చిత్రం రూపొందుతోంది. ఈ ప్రతిష్టాత్మక వెంచర్‌కు డాక్టర్ అనిల్ విశ్వనాథ్ కథ, స్క్రీన్‌ప్లే, డైలాగ్స్ అందించడంతో పాటు షోరన్నర్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రాన్ని శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాసా చిట్టూరి నిర్మించారు. ఈ ప్రాజెక్ట్‌కు నాని కాసరగడ్డ దర్శకత్వంతో పాటు ఎడిటింగ్ నిర్వహిస్తారు. సోమవారం ఈ సినిమా టైటిల్‌ను ఒక స్పైన్ చిల్లింగ్ టీజర్ ద్వారా రిలీజ్ చేశారు.
ఈ చిత్రానికి ‘12ఏ రైల్వే కాలనీ’ అని ఇంట్రస్టింగ్ టైటిల్ పెట్టారు, టీజర్ సినిమా కథను గ్లింప్స్‌లా ప్రజెంట్ చేసింది. అల్లరి నరేశ్ ఒక కిటికీ దగ్గర నిలబడి, ఆలోచనలో, ధ్యాన ముద్రలో కనిపించడంతో టీజర్ ప్రారంభమవు తుంది. టీజర్‌ను వింతైన, కలవరపెట్టే ఘటనలతో డిజైన్ చేశారు. అల్లరి నరేశ్ పాత్ర మరింత ఆసక్తికరంగా ఉండబోతోందని టీజర్ ద్వారా తెలుస్తోంది.
ఈ చిత్రంలో ‘పొలిమే’ సిరీస్ ఫేమ్ డాక్టర్ కా మాక్షి భాస్కర్ల కథానాయికగా నటిస్తోంది. ఈ చిత్రంలో సాయి కుమా ర్, వైవా హర్ష, గెటప్ శ్రీను తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సమ్మర్ లో సినిమాను విడుదల చేస్తామని మేకర్స్ ప్రకటించారు.