calender_icon.png 19 November, 2024 | 3:15 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్యార్థిని బలిగొన్న ర్యాగింగ్ భూతం

19-11-2024 01:19:17 AM

జూనియర్‌ను 3 గంటలు నిలబెట్టిన సీనియర్లు

స్పృహ తప్పి పడిపోయి.. అనంతరం మృతి 

గుజరాత్‌లో ఘటన

గుజరాత్, నవంబర్ 18: ర్యాగింగ్ భూతం మరో విద్యార్థిని పొట్టనబెట్టుకుంది. గుజరాత్‌లోని ధారపూర్‌లోని జీఎంఈఆర్‌ఎస్ వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ ఫస్టియర్ విద్యార్థిని 3 గంటలపాటు నిలబెట్టడంతో స్పృహతప్పి పడిపోయాడు. అనంతరం దవాఖానలో చికిత్స పొందుతూ మరణించాడు. ఇటీవల కోర్సులో అనిల్ మెథాని యా కాలేజీ హాస్టల్‌లోనే ఉంటున్నాడు. పరిచయం పేరుతో సీనియర్లు జూనియర్లను ర్యాగింగ్ చేశారు.

3 గంటల పాటు నిలబెట్టడంతో అనిల్ స్పృహతప్పి పడిపోగా ఆసుపత్రికి తరలించారు. అక్కడే సీనియర్లు బలవంతంగా నిల్చొబెట్టినట్లు పోలీసులకు అనిల్ వాంగ్మూలం ఇచ్చాడు. తర్వాత చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచాడు. అనిల్ తండ్రి ఫిర్యాదు మేరకు 15 మంది సీనియర్లపై పోలీసులు  కేసు నమోదు చేశారు.