నయనతార, ధనుష్‌ల మధ్య వివాదం రోజు రోజుకూ ముదురుతోంది. పుట్టిన రోజు సందర్భంగా ఆమె జీవితం ఆధారంగా రూపొందిన డాక్యుమెం టరీని నేడు నెట్‌ఫ్లిక్స్ విడుదల చేసింది. అయితే ఆ డాక్యుమెంటరీలో ‘నానుమ్ రౌడీ దాన్’ చిత్రంలోని సన్నివేశాన్ని వినియో గించారు. ఈ చిత్రానికి నిర్మాత అయి న ధనుష్.. దీనిపై తీవ్రంగా స్పం దించిన విషయం తెలిసిందే.
తన పర్మిషన్ లేకుండా వాడిన క్లిప్‌ను వెంటనే తొలగించాలని లేదంటే రూ.10 కోట్ల నష్ట పరిహారం చెల్లించాలని హెచ్చరిస్తూ లీగల్ నోటీసు జారీ చేశారు. దీనిపై నయనతార తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ధనుష్‌కు బహిరంగ లేఖ రాశారు. అయితే ‘నానుమ్ రౌడీ దాన్’ క్లిప్‌ను తొలగించకుం డానే నేడు డాక్యుమెంటరీని విడుదల చేశారు.
దీనిపై ధనుష్ తరుఫు న్యాయవాది తిరిగి హెచ్చరికతో కూ డిన నోటీసును జారీ చేశారు. ఈ క్రమంలోనే ధనుష్ లాయర్.. నయనతార లాయర్‌కు లేఖ రాశారు. ‘నా క్లయింట్ ధనుష్‌కు హక్కులు ఉన్న సినిమాలోని వీడియోను ఆయన అనుమతి లేకుండా వాడటం చట్టరిత్యా నేరం.
24 గంటల్లో దాన్ని తొలగించమని మీ క్లయింట్ (నయనతార)కు చెప్పండి. లేదంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. రూ.10 కోట్ల నష్టపరిహారం విషయంలో నయనతారతో పాటు నెట్‌ఫ్లిక్స్ కూడా బాధ్యత వహించాల్సి వస్తుంది” అని హెచ్చరిస్తూ లేఖ రాశారు.