calender_icon.png 17 November, 2024 | 2:54 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రభుత్వ మెడికల్ కళాశాలలో ర్యాగింగ్ కలకలం

17-11-2024 01:03:41 PM

అసిస్టెంట్ ప్రొఫెసర్ పై చర్యలు

ఖమ్మం (విజయక్రాంతి): ఖమ్మం ప్రభుత్వ మెడికల్ కళాశాలలో ర్యాగింగ్ కలకలం రేపుతోంది. కళాశాలలో మొదటి సంవత్సరం ఎంబీబీఎస్ చదువుతున్న విద్యార్థికి యాంటీ ర్యాగింగ్ కమిటీ ఇన్చార్డ్, అసిస్టెంట్ ప్రొఫెసర్ గుండు గీయించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈనెల 12వ తేదీన ఈ ఘటన చోటుచేసుకుంది. స్టైల్ గా కటింగ్ చేసుకున్న విద్యార్థినిపై ఆగ్రహంతో అసిస్టెంట్ ప్రొఫెసర్ అతన్ని బయటికి తీసికెళ్లి గుండు గీయించినట్లు తెలిసింది. ఈ వ్యవహారం ఉన్నతాధికారులకు తెలియడంతో యాంటీ ర్యాగింగ్ కమిటీ బాధ్యతల నుంచి అసిస్టెంట్ ప్రొఫెసర్ ను తప్పించారు. ఈ విషయమై కళాశాల ప్రిన్సిపాల్ ఉన్నతాధికారులకు లేఖ కూడా రాసినట్లు సమాచారం. ర్యాగింగ్ ను నిరోధించాల్సిన అసిస్టెంట్ ప్రొఫెసర్ ఇటువంటి చర్యలకు పాల్పడడం పట్ల ఆయనపై ఉన్నతాధికారులు సీరియస్ గా ఉన్నారు.