11-03-2025 12:07:48 AM
ప్రజావాణిలో కలెక్టర్ రాహుల్ రాజ్
మెదక్, మార్చి 10 (విజయ క్రాంతి): ప్రజావాణి అర్జీలకు గుణాత్మక పరిష్కారం చూపాలనీ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ప్రభుత్వ జిల్లా అధికారులకు సూచించారు. టైం బౌండ్‌లో ప్రజాఫిర్యాదులు, వినతులు పరిష్కరించాలన్నారు. మెదక్ సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం కాన్ఫరెన్స్ హాల్లో ప్రజావాణి కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు.
అదనపు కలెక్టర్ నగేష్, డిఆర్‌ఓ భుజంగరావు, జడ్పీ సీఈఓ ఎల్లయ్య, డి ఆర్ డి ఓ పి డి శ్రీనివాసరావులతో కలిసి ప్రజల నుంచి కలెక్టర్ ఫిర్యాదులు, వినతులు స్వీకరించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడారు. ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను క్షేత్ర స్థాయిలో పరిశీలించి, పరిష్కరించాలని సూచించారు.
ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని ఆదేశిoచారు. ప్రజావాణికి 60 దరఖాస్తులు వచ్చాయని కలెక్టర్ వెల్లడించారు. దరఖాస్తులు పెండింగ్ ఉంచకుండా ఎప్పటికప్పుడు పరిశీలన చేస్తూ పరిష్కరించాలని అధికారులకు సూచించారు. ఈ ప్రజావాణి కార్యక్రమంలో సంబంధిత జిల్లా అధికారులు తదితరులుపాల్గొన్నారు.