26-03-2025 01:51:09 AM
సోదర భావాన్ని పెంపొందించే రంజాన్ మాసం..
వర్ధన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే కెఆర్ నాగరాజు
హనుమకొండ, మార్చి 25 (విజయ క్రాంతి): మంగళవారం రోజున హాసన్ పర్తి మండల పరిధిలోని KLN ఫంక్షన్ హాల్ నందు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఏర్పాటు చేసిన దావత్ - ఏ - ఇఫ్తార్ ఇఫ్తార్ విందులో ముఖ్య అతిథులుగా కూడా చైర్మన్ ఇనుగాల వెంకట్రామి రెడ్డి, హనుమకొండ జిల్లా గ్రంథాలయ చైర్మన్ మహమ్మద్ అజీజ్ ఖాన్, అడిషనల్ కలెక్టర్ వెంకట్ రెడ్డి లతో కలిసి వర్ధన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు పాల్గొన్నారు. సందర్భంగా ఎమ్మెల్యే నాగరాజు మాట్లాడుతూ మానవతా విలువలతో మనిషి మహోన్నతుడిగా మారాలన్నదే ఉపవాసాల అసలు ఉద్దేశ్యం అన్నారు. తమ జీవిత సౌదాల్ని సత్యం, న్యాయం, ధర్మం అనే పునాదుల మీద నిర్మింపజేసుకునేందుకు ఉపయోగపడే సాధనమే ఉపవాస వ్రతం అన్నారు.
మైనార్టీ సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎప్పటికీ సెక్యులర్ పార్టీ అన్నారు. గంగా జమున తెహజీబ్ మన సంస్కృతిలో ఒక భాగం అన్నారు. పండుగలు ఏమైనా అందరం కలిసికట్టుగా చేసుకుంటేనే బాగుంటుందన్నారు.30 రోజుల పాటు ఉపవాస దీక్షను చేస్తున్న ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు. అందరు బాగుండాలి అందులో మనం ఉండాలి అనే నానుడిని అందరూ అలవర్చుకుంటే బాగుంటుందని ఎమ్మెల్యే నాగరాజు ఆకాంక్షించారు. అనంతరం సామూహిక నమాజ్ అనంతరం ఉపవాస దీక్ష చేపట్టిన ముస్లిం సోదరులకు ఫలహారాలు తినిపించి ఉపవాస దీక్ష విడిపించారు.
ఈ కార్యక్రమంలో హనుమకొండ జిల్లా కిసాన్ సెల్ అధ్యక్షుడు ఫింగిలి వెంకట్రామి రెడ్డి, టిపిపిపి లీగల్ సెల్ వైస్ చైర్మన్ నిమ్మనీ శేకర్ రావు, ఆత్మకూర్ ఏఎంసీ వైస్ చైర్మన్ తంగెళ్ళపల్లి తిరుపతి, వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు పినింటి అనిల్ రావు, హాసన్ పర్తి మండల అధ్యక్షుడు పోరెడ్డి మహేందర్ రెడ్డి,కార్పొరేటర్లు వరుణగంటి అరుణ కుమారి, జక్కుల రజిత తో పాటు జిల్లా మైనారిటీ నాయకులు మహమ్మద్ చోటే, సయ్యద్ ఇంతియాజ్, హాసన్ పర్తి మండల మైనారిటీ సెల్ అధ్యక్షుడు మహమ్మద్ అన్వర్ ఖాన్, సయ్యద్ జలీల్, మొహమ్మద్ అఫ్జల్, సయ్యద్ సలీం, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర, జిల్లా, మండల, డివిజన్, గ్రామ నాయకులు కార్యకర్తలు, మహిళలు,వివిధ అనుబంధ సంఘాల నాయకులు యూత్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.