calender_icon.png 20 January, 2025 | 2:25 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆప్కో స్కామ్‌పై విచారణ

13-07-2024 02:04:48 AM

ఏపీ మంత్రి సవిత

హైదరాబాద్, జూలై 12 (విజయక్రాంతి) : వైసీపీ పాలనలో నేతన్నలకు మాజీ సీఎం జగన్ మరణశాసనం రాశారని చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత ఫైరయ్యారు. జగన్ హయాంలో ఆప్కోలో జరిగిన అవినీతిపై పూర్తి స్థాయిలో విచారణ జరిపిస్తామన్నారు. శుక్రవారం చేనేత రంగం, ఆప్కో అంశాలపై మంత్రి సమీక్ష నిర్వహించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. ఆప్కో చేనేత కార్మికులను గత వైసీపీ ప్రభుత్వం సర్వ నాశనం చేసిందని విమర్శించారు. ఉపాధి లేకపోవడంతో చేనేత కార్మికులు ఇతర ప్రాంతాలకు వలస వెళ్లే పరిస్థితి తీసుకొచ్చారన్నారు. ఏపీలో చేనేత రంగం నిర్వీర్యమైందని, ఎన్డీయే పాలనలో చేనేత కార్మికులకు సబ్సిడీ అందించనున్నట్లు చెప్పారు.