12-03-2025 12:44:05 AM
ఎమ్మెల్యే కూనంనేని
కొత్తగూడెం మార్చి 11 (విజయక్రాంతి) : ప్రజా ప్రభుత్వంగా చెప్పుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం సామాన్య, మధ్యతరగతి వర్గాలకు మేలుచేసే బడ్జెట్టును ప్రెవేశపెడుతుందని ఆశిస్తున్నానని కొత్తగూడెం నియోజకవర్గ శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు అన్నారు.
రాష్ట్ర బడ్జెట్టును ప్రెవేశపెడుతున్న సందర్బంగా ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు.ఆర్ధిక శాఖా మంత్రి మల్లుభట్టి విక్రమార్కకు వుమ్మడి ఖమ్మం జిల్లాతోపాటు కొత్తగూడెం నియోజకవర్గంపై పూర్తి అవగాహన ఉందని, నియోజకవర్గానికి కావాల్సిన కేటాయింపులపై ఇప్పటికే పలుమార్లు లేఖలు అందించామని తెలిపారు.
సాగునీటి, త్రాగునీటి ప్రాజెక్టులు, సీతారామ ప్రాజెక్టు, సింగరేణి భూగర్భగనులు, కేటీపీఎస్ తదితర ప్రాజెక్టులకు ప్రోత్సహాన్ని అందిస్తారని ఆశిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ అంశాలను పూర్తిగా పరిశీలించిన అనంతరం తన స్పష్టమైన అభిప్రాయాన్ని సమావేశాల్లో ప్రస్తావిస్తానని తెలిపారు.