calender_icon.png 21 January, 2025 | 9:49 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వ్యాన్‌ను ఢీకొట్టిన ప్రైవేట్ బస్సు

26-08-2024 02:47:59 AM

  1. ప్రమాదంలో బస్సు క్లీనర్ దుర్మరణం 
  2. మరో ఐదుగురు ప్రయాణికులకు గాయాలు 
  3. వేములపల్లి శివారులో ఘటన

నల్లగొండ, ఆగస్టు 25 (విజయక్రాంతి): వేగంగా వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు అదుపుతప్పి వెనుక నుంచి వ్యాన్‌ను ఢీకొట్టింది. ఘటనలో బస్సు క్లీనర్ మృతిచెందాడు. వేములపల్లి మండలం శెట్టిపాలెం శివారులో ఘటనలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఏపీలోని బాపట్ల నుంచి శనివారం రాత్రి హైదరాబాద్‌కు ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ప్రయాణికులతో బయల్దేరింది. ఆదివారం తెల్లవారుజామున బస్సు శెట్టిపాలెం శివారు చేరుకోగానే అదుపు తప్పి రోడ్డు పక్కన నిలిపిన వ్యాన్‌ను వెనుక నుంచి ఢీకొట్టింది.

దీంతో బస్సు ముందు క్యాబిన్ నుజ్జునుజ్జయింది. క్లీనర్‌కు తీవ్ర గాయాలై ఘటనా స్థలంలోనే మృతి చెందాడు. మరో ఐదుగురు ప్రయాణికులకు గాయాలయ్యాయి. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులను మిర్యాలగూడ ఏరియా దవాఖానకు తరలించారు. మృతుడిని ఏపీలోని పల్నాడు జిల్లా చిలుకలూరిపేటకు చెందిన దావల దావీద్ (40)గా గుర్తించారు. డ్రైవర్ నిద్రమత్తులో బస్సు నడపడంతోనే ప్రమాదం సంభవించిందని స్థానికులు తెలిపారు. ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.