21-02-2025 08:20:23 PM
సామాజిక సేవ కార్యకర్త గంధం సైదులు...
మునగాల: మునగాల పోస్టల్ శాఖ ఆధ్వర్యంలో ప్రవేశపెట్టిన ప్రమాద బీమా పాలసీ కుటుంబానికి ధీమా అని దీనిని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని సామాజిక సేవా కార్యకర్త గంధం సైదులు కోరారు. శుక్రవారం మునగాలలో తపాలాశాఖ ఆధ్వర్యంలో ప్రమాద బీమాపై అవగాహన కార్యక్రమం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ... ఏడాదికి రూ.550 తో ప్రమాద బీమా చేయించుకుంటే ఏదైనా ప్రమాదం జరిగి మరణిస్తే ఆ కుటుంబానికి రూ.10 లక్షల ఆర్ధిక భరోసా అందుతున్నారు. 18 నుంచి 65 ఏండ్ల లోపు వారు ఎవరైనా పాలసీ చేయించుకోవచ్చన్నారు. మరింత సమాచారం కొరకు దగ్గరలోని పోస్టాఫీస్ లో సంప్రదించాలని కోరారు.
పాలసీ తీసుకున్నవారికి ప్రమాదం జరిగితే ఐపీడి కింద రూ.లక్ష వరకు రీఎంబర్స్మెంట్ ఉంటుందని చెప్పారు. ఈ పాలసీల గురించి పోస్టర్ శాఖ ఆధ్వర్యంలో మరింత ప్రచార కార్యక్రమం నిర్వహించాలని కోరారు. గ్రామాల్లో కూడా అనుభవం ఉన్న ప్రతి ఒక్కరు పేదల కోసం ఈ పథకాలను సద్వినియోగం చేసుకునే విధంగా సహకారం అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఐపీపిబి మేనేజర్ మణికంఠ, యస్ పి యం దయాకర్, బిపియం హరిప్రసాద్ రామ నర్సయ్య, బ్రహ్మచారి, నరేష్, అబెద, ముని, మోతీలాల్, సందీప్, సాయిరామ్ తదితరులు పాల్గొన్నారు.