calender_icon.png 16 April, 2025 | 12:28 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దాహార్తి తీర్చిన ఖానాపూర్ ఎమ్మెల్యే చిత్రపటానికి పాలాభిషేకం

14-04-2025 05:33:54 PM

ఖానాపూర్ (విజయక్రాంతి): నిర్మల్ జిల్లా ఖానాపూర్ మున్సిపాలిటీలోని డబుల్ బెడ్ రూమ్ కాలనీలో నీటి ఎద్దడి తీర్చిన ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ చిత్రపటానికి సోమవారం ఆ కాలనీవాసులు పాలాభిషేకం చేసి కృతజ్ఞతలు తెలియజేశారు. ఇటీవల ఈ కాలనీలో నీటి ఎద్దడి తీవ్రం కాగా స్థానికులు చేసిన విన్నపం మేరకు స్పందించిన ఎమ్మెల్యే మున్సిపల్ నిధులలో నుంచి రెండు బోర్లు వేయించి సాగునీటి వసతి కల్పించారు. ఇచ్చిన మాట ప్రకారం దాహార్తి తీర్చిన ఎమ్మెల్యే వెడమ బొజ్జు పటేల్ కు స్థానికులు ఈ విధంగా కృతజ్ఞతలు తెలుపుకున్నారు.