calender_icon.png 30 January, 2025 | 11:13 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నియంత పాలనపై ప్రజల తిరుగుబాటు

12-11-2024 12:00:00 AM

కొడంగల్ ఘటనపై బీజేపీ ట్వీట్

హైదరాబాద్, నవంబర్ 11 (విజయక్రాం తి): కాంగ్రెస్ సర్కార్ పరిపాలన నచ్చకనే రాష్ట్ర ప్రజలు ఎదురుతిరుగుతున్నారని.. దీనికి బెస్ట్ ఉదాహరణ సీఎం నియోజకవర్గమైన కొడంగల్‌లో కలెక్టర్‌పై రైతులు చేసిన దాడే అంటూ రాష్ట్ర బీజేపీ.. ఎక్స్ వేదికగా ఎద్దేవా చేసింది. వికారాబాద్ జిలా లగచర్ల గ్రామంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజలు చేసిన తిరుగుబాటుపై సోమవారం బీజేపీ ట్వీట్ చేసింది.

సీఎం రేవంత్ రెడ్డి నియంత విధానాలను వ్యతిరేకిస్తూ లగచర్ల ప్రజలు అధికారులపై తమ కోపాన్ని ప్రదర్శించారని బీజేపీ ట్వీట్ చేసింది. ఇప్పటికైనా పచ్చని పంట పొలాల్లో ఫార్మాసిటీ ఏర్పాటు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కోరారు.