calender_icon.png 30 November, 2024 | 6:09 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కేటీఆర్‌కు రాజకీయ సమాధే

29-10-2024 02:15:12 AM

కాంగ్రెస్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి 

హైదరాబాద్, అక్టోబర్ 28 (విజయక్రాంతి): జన్వాడ ఫాం హౌస్‌పై సెర్చ్ వారెంట్ ఇవ్వకుండానే సోదాలు ఎలా చేస్తు న్నారని బీఆర్‌ఎస్ నేత కేటీఆర్ ప్రశ్నించడం అతని తెలివి తక్కువ తనానికి నిదర్శనమని, ఎలాంటి సమాచారం లేకుండానే తనిఖీ చేసే హక్కు అధికారులకు ఉంటుందని కాంగ్రెస్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి పేర్కొన్నారు.

రాజ్‌పాకాల లేకుండానే ఆయన నివాసంలో పార్టీ జరిగిందంటే నవ్వొస్తున్నదని, రాజ్‌పాకాల చరిత్ర మాకు తెలియనిదా అని అన్నారు. సోమవారం ఆయన సీఎల్పీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. బావమరిది తప్పు చేస్తే వెనకేసుకొస్తున్న కేటీఆర్‌కు రాజకీయ సమాధి తప్పదన్నారు.

పార్టీలో పాల్గొన్న విజయ్ మద్దూరి డ్రగ్స్ వినియోగించినట్లు తేలిందన్నారు. అధికారులు దర్యాప్తు చేయడం తప్పా? ఇందులో సీఎం రేవంత్‌రెడ్డి, అధికారుల ప్రమేయం ఎక్కడుందని ఆయన ప్రశ్నించారు.