calender_icon.png 28 September, 2024 | 9:03 PM

రాష్ట్రంలో పోలీస్ రాజ్యం నడుస్తోంది

27-09-2024 12:28:13 AM

బీఆర్‌ఎస్ నేత దేవీప్రసాద్

హైదరాబాద్, సెప్టెంబర్ 26       (విజయక్రాంతి): తొమ్మిది నెలలుగా తెలంగాణలో పోలీస్ రాజ్యం నడుస్తోందని బీఆర్‌ఎస్ నేత దేవీప్రసాద్ ఆరోపించారు. ప్రజాప్రభుత్వం అని చెప్పుకొంటున్న కాంగ్రెస్.. బీఆర్‌ఎస్ లీడర్లపై దాడులకు తెగబడుతుందన్నారు. గురువారం తెలంగాణ భవన్‌లో మీడియాతో ఆయన మాట్లాడారు. ఖమ్మంలో బీఆర్‌ఎస్ నేతలపై రాళ్ల దాడి చేశారని, ఎమ్మెల్యే ఇంటిపై మరో ఎమ్మెల్యే దాడి చేసి ప్రశ్నించే వారిని పోలీస్ స్టేషన్లకు తిప్పుతున్నారని ఆరోపించారు. బీఆర్‌ఎస్ సోషల్ మీడియా సిబ్బందిపై అక్రమ కేసులు పెడుతున్నారని, ఇందిరమ్మ రాజ్యం అంటే నిర్బంధ రాజ్యమా అని నిలదీశారు.

ఆరు గ్యారెంటీలు అడిగితే ఎదురుదాడి దిగుతున్నారన్నారు. ఉద్యోగు ల కు 4 డీఏలు పెండింగ్‌లో ఉన్నాయని సీఎం ౯ నెలల నుంచి కల వడం లేదని ఉద్యోగ సంఘాల నాయకులు పేర్కొన్నట్టు తెలిపారు. అనంతరం చిరుమళ్ల రాకేశ్ కుమార్ మాట్లాడుతూ..కాంగ్రెస్ పార్టీ కామారెడ్డిలో ప్రకటించిన బీసీ డిక్లరేషన్‌ను అమలు చేయాలని డిమాండ్ చేశారు.