02-04-2025 12:50:30 AM
సర్కస్ గ్రౌండ్ పార్కును అద్భుతంగా తీర్చిదిద్దాం
కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్
కరీంనగర్, ఏప్రిల్ 1 (విజయక్రాంతి): స్మార్ట్ సిటీ నిధులతో అప్పటి ఎంపీ వినోద్ కుమార్ తాను ఆలోచన చేసి సర్కస్ గ్రౌండ్ పార్కును అద్భుతంగా తీర్చిదిద్దామన్నారు. దానిలో భాగంగానే ప్రజలు ఆహ్లాదమైన వాతావరణం గడిపే విధంగా ఈ పార్కు తీర్చిదిద్దడం జరిగిందని కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అన్నారు.
ప్రజలకు మంచి వాతావరణ అందించాలనే ఉద్దేశంతోనే మానేరు ప్రాజెక్టు కూడా చేపట్టామన్నారు. ఆ ప్రాజెక్టులో అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన అనేక వివిధ అద్భుతమైన కార్యక్రమాలు చేపట్టాలని ఆలోచన చేశామన్నారు. కానీ ఇప్పటి ప్రభుత్వం తాము చేపట్టిన ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు నిధులు మంజూరు చేయడం లేదన్నారు.
రానున్న రోజుల్లో ఈ ప్రాజెక్టులను పార్కులను మరింత అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వంతో పోరాడి నిధుల మంజూరు కు కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో నగర బి ఆర్ ఎస్ అధ్యక్షులు చల్ల హరి శంకర్, మాజీ డిప్యూటీ మేయర్ అబ్బస్ శమీ, మాజీ కార్పొరేటర్లు ఎడ్ల సరిత- అశోక్, గంది మహేష్ దిండిగాల మహేష్, నాంపల్లి శ్రీనివాస్, కచ్చు రవి, ఆలీ , మరియు బిఆర్‌ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.