calender_icon.png 26 December, 2024 | 11:24 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉద్యమాలకు వేదిక.. అంబేద్కర్ చౌక్!

05-12-2024 12:00:00 AM

హైదరాబాద్‌లోని ధర్నా చౌక్ గురించి తెలియని వారుండరు.. అది ఉద్యమాకు వేదిక. అదే మాదిరి కుమ్రంభీం ఆసిఫాబాద్ బస్టాండ్ సమీపంలో కూడా అంబేద్కర్ చౌక్ ఉద్యమాలకు అడ్డగా చెబుతుంటారు ఉద్యమకారులు. తెలంగాణ మలిదశ ఉద్యమంలో అంబేద్కర్ చౌక్ పాత్ర మరువలేనిది. రాష్ట్ర జేఏసీ ఇచ్చిన ప్రతి పిలుపు ఇక్కడి నుంచి అమలు జరిగేవి. ఉద్యమ కార్యాచరణ కూడా ఇక్కడి నుంచే ప్రారంభమయ్యేది. అఖిలపక్షం ఆధ్వర్యంలో అంబేద్కర్ సాక్షిగా తెలంగాణ మలిదశ ఉద్యమ సమయంలో ప్రతిరోజు తెలంగాణ ఉద్యమకారులు, కుల సంఘాలు, ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాలు ఇలా అందరూ కలిసికట్టుగా.. రిలే నిరాహార దీక్షల్లో పాల్గొనేది.    

ముఖ్యంగా అంబేద్కర్ స్ఫూర్తితో రాష్ట్ర సాధన కమిటీ ఇచ్చిన పిలుపుతో ప్రజలంతా ఏకమై ఉద్యమంలో పాలు పంచుకున్నారు. తెల్లవారితే ఉద్యమకారులు అంబేద్కర్ చౌక్ వద్దకు చేరుకుని సాయంత్రం వరకు అక్కడే ఉండేవారు. ఈ ప్రాంతం ఎప్పుడూ జనాలతో రద్దీగా ఉండేది. రహదారి పక్కనే కూడలి ఉండటంతో రాస్తారోకో కార్యక్రమాలతో పాటు వంటావార్పు కార్యక్రమాలు ఇక్కడే జరిగేవి. సకల జనుల సమ్మెలో భాగంగా బంద్ కార్యక్రమలు నిర్వహించేది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డక.. కొత్త జిల్లాలను ఏర్పాటు చేసింది ప్రభుత్వం. కొత్త జిల్లాల ఏర్పాటు తర్వాత ఉద్యమాలకు కలెక్టరేట్ వేదికగా మారింది. 

- చిప్ప సురేశ్, 

కుమ్రంభీం ఆసిఫాబాద్ 

అది ఉద్యమాలకు వేదిక..

తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో ఆసిఫాబాద్‌లో ఏర్పాటు చేసిన జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించే కార్యక్రమాలకు అంబేద్కర్ చౌక్ మంచి వేదికైంది. ఉద్యమంలో చేపట్టే కార్యక్రమాలపై చర్చించడం జరుగుతుండే. ఉద్యమంలో చేపట్టిన నిరసన కార్యక్రమలతో పాటు రాస్తారోకో, వంటావా ర్పు కార్యక్రమాలు ఇక్కడే జరిగేవి. అన్ని వర్గాల ప్రజలు ఉద్యమానికి సహకారం అందించడంతో విజయవంతంగా తెలంగాణ సాధించుకు న్నాం. అంబేద్క ర్ చౌక్ వద్దకు వస్తే ఇప్పటితకీ ఉద్యమ సమయంలో చేపట్టి న కార్యక్రమా లు గుర్తుకు 

వస్తాయి.

- గంధం శ్రీనివాస్, జేఏసీ కన్వీనర్