జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్
మెదక్, ఫిబ్రవరి 5(విజయ క్రాంతి): కేంద్రీయ విద్యాలయం నిర్మాణం చేపట్టడానికి అనువైన స్థలాన్ని గుర్తించే ప్రక్రియ వేగవంతం చేయాలని కలెక్టర్ రాహుల్ రాజ్ అధికారులు ఆదేశించారు. బుధవారం మెదక్ పట్టణం పాతూరు లో మెదక్ ఆర్డీవో రమాదేవి, తహసిల్దార్ లక్ష్మణ్ బాబు తో కలిసి కేంద్రీయ విద్యాలయం నిర్మాణానికి 5 ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని కలెక్టర్ పరిశీలించారు.
పాతూరులో కేంద్రీయ విద్యాలయం కోసం ప్రభుత్వ స్థలాన్ని పరిశీలించడం జరిగిందని, సంబంధిత నివేదికలు తయారుచేసి వాటి ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని, కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్.ఐ లక్ష్మణ్ పాల్గొన్నారు.
మధ్యాహ్న భోజనంపై ఆరా..
మధ్యాహ్న భోజనాన్ని పగడ్బందీగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులకు సూచించారు. పాతూరు గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేశారు. విద్యార్థులకు ఇచ్చే ఆహారం, సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
మంచినీటి డైనింగ్ హాల్, క్లాస్ రూమ్లు, పరిసరాలు, స్టోర్స్, వంట గదులను స్వయంగా తనిఖీ చేశారు. ఏమైనా సమస్యలుంటే తమ దృష్టికి తీసుకురావాలని కోరారు. మధ్యాహ్న భోజనాన్ని పరిశుభ్రంగా అందించాలని అధికారులను ఆదేశించారు.