calender_icon.png 27 December, 2024 | 3:42 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ముగ్గురు తెలుగు తేజాలకు చోటు

25-12-2024 12:45:55 AM

* అండర్ మహిళల టీ20 ప్రపంచకప్

న్యూఢిల్లీ: వచ్చే ఏడాది జరగనున్న ఐసీ సీ అండర్ మహిళల టీ20 ప్రపంచకప్ కోసం బీసీసీఐ 15 మందితో కూడిన భారత జట్టును ప్రకటించింది. మలేషియాలోని కౌ లలంపూర్ వేదికగా జరగనున్న మెగా టోర్నీ కి యంగ్ ఇండియాను నిక్కి ప్రసాద్ నడిపించనుంది. ఈ జట్టులో ముగ్గురు తెలుగు తేజాలకు చోటు దక్కడం విశేషం. తెలంగాణకు చెందిన గొంగడి త్రిష, కేసరి ధ్రుతితో పాటు విశాఖకు చెందిన షబ్నమ్ ఎంపికయ్యారు.

ఇటీవలే అండర్ ఆసియా మ హిళల కప్‌లో భారత్ విజేతగా నిలవడంలో గొంగడి త్రిష కీలకపాత్ర పోషించింది. వచ్చే ఏడాది జనవరి 18 నుంచి ఫిబ్రవరి 2 వరకు జరగనున్న టోర్నీలో మొత్తం 41 మ్యాచ్‌లు జరగనున్నాయి. 16 జట్లను నాలుగు గ్రూపులుగా విభజించారు. గ్రూప్ దశలో భారత్ జనవరి 19న వెస్టిండీస్, 21న మలేషియా, 23న శ్రీలంకతో ఆడనుంది.