న్యూఢిల్లీ: హాంగ్ కాంగ్ వేదికగా ఈ నెల 20 నుంచి జరగనున్న ఆసియా క్రాస్ కంట్రీ చాంపియన్‌షిప్స్‌కు ఎనిమిది మందితో కూడిన భారత జట్టును అథ్లెటిక్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఏఎఫ్‌ఐ) ప్రకటించింది. సీనియర్ టీమ్‌తో పాటు జూనియర్ టీమ్‌ను ఎంపిక చేసింది. కాగా సీనియర్ జట్టులో జాతీయ రికార్డు హోల్డర్, అథ్లెట్ గుల్వీర్ సింగ్‌కు చోటు దక్కింది. గతేడాది ఆసియా గేమ్స్‌లో 10వేల మీటర్ల రేసులో జాతీయ రికార్డుతో కాంస్యం గెలుచుకున్నాడు. 8 మంది సీనియర్లతో కూడిన జట్టుతో పాటు జూనియర్ జట్టు కూడా నవంబర్‌లో పాక్ వేదికగా జరగనున్న సౌత్ ఆసియా క్రాస్ కంట్రీ చాంపియన్‌షిప్‌లో పాల్గొననుంది.