calender_icon.png 12 February, 2025 | 1:36 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

స్థానిక ఎన్నికల్లో గులాబీ జెండా ఎగరాలి..

11-02-2025 08:08:38 PM

భద్రాచలం మండలం బిఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో జిల్లా నాయకులు మానే రామకృష్ణ..

భద్రాచలం (విజయక్రాంతి): భద్రాచలం మండల బిఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం స్థానిక అంబేద్కర్ సెంటర్లో బిఆర్ఎస్ భద్రాచలం మండల కన్వీనర్ ఆకోజు సునీల్ కుమార్ అధ్యక్షతన మంగళవారం జరిగింది. ఈ సమావేశంలో పాల్గొన్న బిఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు మానె రామకృష్ణ మాట్లాడుతూ... స్థానిక ఎన్నికల్లో గులాబీ సైన్యం సత్తా చాటాలని భద్రాచలం మండలంలో స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు వచ్చినా కార్యకర్తలు అంతా సిద్ధంగా ఉండాలి అని పిలుపునిచ్చారు. 

రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ హామీలు అమలు చేయడంలో విఫలమైందని ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలు 6 గ్యారంటీలు అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరంగా వైఫల్యం చెందిందని. కాంగ్రెస్ ప్రభుత్వం మీద వ్యతిరేకతే బిఆర్ఎస్ గెలుపునకు నాంది పలుకుతుందని అన్నారు. భద్రాచలం మండలంలో ఉన్నటువంటి ప్రధాన సమస్యల పరిష్కారమే లక్ష్యంగా బిఆర్ఎస్ కృషి చేస్తుందని టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసే ప్రతి వ్యక్తి కేసీఆర్ అనే భావనతో ప్రజలందరూ ఓట్లు వేసి గెలిపిస్తారని గులాబీ సైన్యం అంత ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలు ప్రజల్లో విస్తృతంగా తీసుకుపోయి కేసీఆర్ పాలనకు రేవంత్ రెడ్డి పాలనకు తేడా ప్రజలకు స్పష్టంగా వివరించాలని బారాస గెలుపునకు ప్రతీ కార్యకర్త శక్తివంతన లేకుండా కృషి చేయాలని కోరారు. 

ఈ కార్యక్రమంలో మండల పార్టీ కో కన్వీనర్ రేపాక పూర్ణచంద్రరావు, కొల్లం జయ ప్రేమ్ కుమార్, పడిసిరి శ్రీనివాస్,బత్తుల నరసింహులు, గుంజా ఏడుకొండలు, అయినాల రామకృష్ణ, ఇమంది నాగేశ్వరరావు, మురాల డానియల్ ప్రదీప్, బద్ది బాబి, రాఘవ, రవి కిరణ్, గోసుల శ్రీను, గణేష్, సుబ్బారావు, సమర్ కుమార్, పితాని భాను ప్రసాద్, మండల మహిళా నాయకులు కావూరి సీతామహాలక్ష్మి, ప్రియాంక, రమాదేవి, సలోమి తదితరులు పాల్గొన్నారు.