calender_icon.png 22 February, 2025 | 10:46 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎఫ్‌ఎల్‌ఎన్ విద్య అమలుకు జిల్లాలో పైలట్ ప్రాజెక్ట్

22-02-2025 12:00:00 AM

ఎనిమిదేళ్లలోపు విద్యార్థుల కోసం   ఈ ప్రాజెక్టు 

మేడ్చల్, ఫిబ్రవరి 21(విజయక్రాంతి): ఎఫ్ ఎల్ ఎన్ విద్య అమలుకు మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో పైలట్ ప్రాజెక్టు చేపట్టనున్నారు. పైలట్ ప్రాజెక్ట్ అమలుకు రాష్ట్రంలో ఆరు జిల్లాలను ఎంపిక చేయగా అందులో మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఒకటి. ఈ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తోంది. ఎనిమిదేళ్ల లోపు విద్యార్థులు బాగా చదవడం, రాయడం, సంఖ్యా శాస్త్రంలో పట్టు సాధించడానికి ఈ ప్రాజె క్టును చేపట్టారు. జిల్లాలో పైలట్ ప్రాజెక్టును ప్రారంభిస్తున్న సందర్భంగా శుక్రవారం విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ యోగితా రాణా వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కలెక్టర్ గౌతమ్, జిల్లా విద్యాశాఖ అధికారి విజయ కుమారి వీడియో కాన్ఫరెన్సు లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఇప్పటికే కంప్యూటర్లు అందుబాటులో ఉన్న పాఠశాలల్లో ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తామని, మిగతా పాఠశాలలో కూడా మౌలిక వసతులు కల్పించి అమలు చేస్తామని అన్నారు.