calender_icon.png 24 March, 2025 | 5:28 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రపంచ జల దినోత్సవం సందర్భంగా తమలపాకుపై నీటి బిందు చిత్రం..!

22-03-2025 04:18:59 PM

కామారెడ్డి (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రానికి చెందిన ప్రముఖ చిత్రకారుడు బాసబాల్ కిషన్ ప్రపంచ జల దినోత్సవం సందర్భంగా తమలపాకుపై కుళాయితో పాటు నీటి బిందు చిత్రాన్ని చెక్కారు. ఈ సందర్భంగా కిషన్.. విశ్వంలో జలం లేనిదే జీవులకు మనుగడ లేదని, నీటిని ఎవరూ వృథా చేయవద్దని సందేశం ఇచ్చారు. ఈ చిత్రం చూసిన పలువురు బాల్ కిషన్ ను అభినందిస్తున్నారు. కాగా, కిషన్ గతంలోనూ దినుసులపై పలు చిత్రాలు గీసి ఆకట్టుకున్నారు.