calender_icon.png 17 November, 2024 | 11:02 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ట్రేడ్ సెంటర్ కూలుతున్న ఫొటో

12-09-2024 02:38:49 AM

  1. ఆనాటి లైవ్ ఫొటో వైరల్ 
  2. శిథిలాల కిందపడి మరణించిన ఫొటో జర్నలిస్టు

న్యూయార్క్, సెప్టెంబర్ 11:  ఉగ్రమూకలు న్యూయార్క్‌లోని వరల్డ్ ట్రేడ్ సెంటర్ (డబ్ల్యూటీసీ) జంట భవనాలను కూల్చి ఇప్పటికీ 23 ఏళ్లు పూర్తయింది. ఈ సందర్భంగా ఆ విధ్వంసానికి సంబంధించిన ఓ చిత్రం ఇప్పుడు సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతున్నది. ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలో ఓ ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. అంతర్జాతీయ మీడియా సంస్థల కథనాల ప్రకారం.. 9/11 దాడి జరిగినప్పుడు డబ్ల్యూటీసీ భవనాలు కుప్పకూలుతున్నాయి.

ఇదే సమయంలో ఆ ప్రాంతంలో ఉన్న బిల్ బిగ్గార్ట్ అనే ఫొటో జర్నలిస్టు తన కెమెరాలో ఆ దృశ్యాలను బంధించాలని పెద్ద సాహసం చేశాడు. అగ్నిమాపక సిబ్బంది కంటే ముందే ఘటనా స్థలానికి చేరుకుని అనేక ఫొటోలు తీశాడు. ఈ క్రమంలో ఆయన కాంక్రీట్ శిథిలాల కింద చిక్కుకుపోయాడు. భవనాలు పూర్తిగా నేలమట్టమైన నాలుగు రోజుల తర్వాత శిథిలాల కింద బిల్ బిగ్గార్ట్ మృతదేహం లభ్యమైంది.

అలా పెద్ద విధ్వంసాన్ని కెమెరాలో బంధించి, ప్రాణాలొదిలన ఫొటో జర్నలిస్టుగా బిల్ బిగ్గార్ట్ చరిత్రకెక్కారు. చాలా ఏళ్ల తర్వాత ఆయన తీసిన ఫొటోలు ఇప్పుడు బయటకు రావడంపై సర్వత్రా ఆసక్తి నెలకొన్నది. చరిత్రలో అత్యంత విషాదకర ఘటన 9/11.