24-03-2025 11:02:28 PM
గజ్వేల్: గజ్వేల్ ఎమ్మెల్యేగా కేసీఆర్ జీత భత్యాలు పొందుతూ ప్రజలకు అందుబాటులోకి రాకపోవడాన్ని నిరసిస్తూ సోమవారం రాజ్ భవన్, గవర్నర్ కార్యాలయంలో గజ్వేల్ కాంగ్రెస్ నేతలు పాదయాత్రగా వెళ్లి వినతిపత్రం అందజేశారు. గత 15 నెలలుగా కేసీఆర్ గజ్వేల్ ప్రజలకు కనిపించడం లేదని, ఇక్కడి సమస్యలు పరిష్కరించడం లేదని, సుమారు రూ.58 లక్షల జీతభత్యాలు పొంది తమను పట్టించుకోవడం లేదని పేర్కొన్నారు. దీనిని దృష్టిలో పెట్టుకొని ఆయనను బర్తరఫ్ చేయాలని ఆ వినతి పత్రంలో కోరారు. రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షురాలు అంక్షారెడ్డి ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేయగా, మాజీ కార్పొరేషన్ చైర్మన్ ఎలక్షన్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ నరేందర్ రెడ్డి, న్యాయవాది సాజిద్ బేగ్, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు సాయి గౌడ్ తదితరులు పాల్గొన్నారు.