calender_icon.png 24 February, 2025 | 1:51 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉద్యోగాల పేరిట మోసం చేస్తున్న వ్యక్తి అరెస్ట్

17-02-2025 11:29:51 PM

హైదరాబాద్ సిటీబ్యూరో (విజయక్రాంతి): ఉద్యోగాల పేరిట నిరుద్యోగులను మోసం చేసి డబ్బులు వసూలు చేస్తున్న ఓ వ్యక్తిని పోలీసులు ఆదివారం అరెస్ట్ చేశారు. హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ డీసీపీ సుధీంద్ర తెలిపిన ప్రకారం వివరాలిలా ఉన్నాయి. చింతల్, వెంకటేశ్వర నగర్‌కు చెందిన కాలువ భార్గవ్ అనే వ్యక్తి మాదాపూర్‌లో నకిలీ సాఫ్ట్‌వేర్ కంపెనీని స్థాపించాడు. దాని పేరిట ఐటీ ఉద్యోగాలు కావాలనుకునే వారికి జూనియర్ డెవలపర్ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా ఉద్యోగాలు ఇప్పిస్తానని నమ్మించి మోసం చేశాడు. ఆశావహుల నుంచి రూ.లక్ష నుంచి 2లక్షలు వసూలు చేవాడు. నకిలీ ఆర్డర్ కాపీలను ఇచ్చి వారిని నమ్మించేవాడు. టాస్క్‌ఫోర్స్ సెంట్రల్ జోన్ పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని అతని నుంచి రూ.1లక్ష, నకిలీ అపియింట్‌మెంట్లు, ఫేక్ ఐడీ కార్డులు, రెండు మొబైల్స్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అతనిపై లల్లాగూడ, జీడిమెట్ల, మాదాపూర్, కల్వకుర్తి పోలీస్ స్టేషన్లలో కూడా కేసులున్నట్లు గుర్తించారు.