calender_icon.png 10 March, 2025 | 2:29 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వద్దన్నా ఔటర్ పైకి బైకు.. ప్రమాదంలో వ్యక్తి మృతి

09-03-2025 07:12:18 PM

రాజేంద్రనగర్ (విజయక్రాంతి): ఔటర్ సిబ్బంది వారిస్తున్నా వినకుండా రింగ్ రోడ్డుపైకి వెళ్ళిన ఓ ద్విచక్ర వాహనదారుడు ప్రమాదానికి గురై దుర్మరణం చెందిన సంఘటన శంషాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సయ్యద్ మహమ్మద్ అలీ(53) కొన్ని సంవత్సరాలుగా తన కుటుంబంతో కలిసి శంషాబాద్ లోని రాజీవ్ గృహకల్పలో నివాసముంటూ ప్రైవేటు జాబు చేస్తున్నాడు. శనివారం మధ్యాహ్నం 12:30 గంటలకు సయ్యద్ మహబూబ్ అలీ షాదనగర్ లో పని ఉందని చెప్పి తన బైక్ హోండా షైన్ TS13EM6272 పైన వెళ్లాడు. మహబూబ్ కి రోజూ కల్లు తాగే అలవాటు ఉంది.

ఈ క్రమంలో శనివారం రాత్రి 10:00 గంటలకు మృతుడి బంధువు అయిన ఎండి ఖలీల్ అనే వ్యక్తి మహబూబ్ అలీ కుటుంబ సభ్యులకు ఫోన్ చేశాడు. తొండుపల్లి పరిధిలోని ఔటర్ రింగ్  రోడ్డుపై మహబూబ్ అలీ ప్రమాదానికి గురై చనిపోయాడని టోల్గేట్ సిబ్బంది చెప్పారని తెలిపాడు. మృతుడి కుటుంబ సభ్యులు వెళ్లి చూడగా పెద్ద గోల్కొండ నుంచి తొండుపల్లి వచ్చే ఓఆర్ఆర్ పై డివైడర్ దగ్గర రక్తగాయలతో మహబూబ్ అలీ చనిపోయి ఉన్నాడు. ఈ విషయమై అక్కడి సిబ్బందిని అడుగగా.. తాము వద్దని వారించిన సయ్యద్ మహబూబ్ అలీ వినకుండా ఔటర్ రింగ్ రోడ్డు పైకి బైకుతో వెళ్ళాడని తెలిపారు.

పెద్దగోల్కొండ వైపు వెళ్లి తిరిగి ఔటర్ రింగ్ రోడ్డు పై తొండుపల్లి వైపు రాంగ్ రూట్ లో వచ్చి బైక్ ని అజాగ్రత్తగా, ప్రమాదకరంగా నడుపుతూ గుర్తుతెలియని వాహనానికి డివైడర్ దగ్గర ఢీకొన్నట్లు తెలిపారు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన మహబూబాబాద్ అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలిపారు. దీంతోపాటు టోల్గేట్ సిబ్బంది ఎంట్రీ సీసీ ఫుటేజ్ కూడా మృతుడి కుటుంబ సభ్యులకు చూపించారు. ఆదివారం కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.