28-04-2025 08:02:12 PM
కామారెడ్డి (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా పాల్వంచ మండలం ఇసాయిపేట గ్రామానికి చెందిన బొట్ల సంజీవ్(35) రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన సంజీవ్ ను హైదరాబాదులోని గాంధీ ఆసుపత్రికి తరలించారు. గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం ఉదయం మృతి చెందారు. కాగా మృతుడు డిసిఎం డ్రైవర్ గా పనిచేస్తున్నారు. డీసీఎం డ్రైవర్ గా పనిచేస్తున్న బొట్ల సంజీవ్ ఎప్పటి మాదిరిగానే కామారెడ్డిలో డీసీఎం పెట్టి బైక్ పై ఇసాయిపేట గ్రామానికి తిరిగి వస్తున్న క్రమంలో కామారెడ్డి-సిరిసిల్ల రహదారిపై ఉగ్రవాయి మైసమ్మ వద్ద గూడ్స్ ఆటోను వెనుక నుండి ఢీకొట్టడంతో తలకు తీవ్ర గాయాలయ్యాయి.
దీంతో స్పందించిన స్థానికులు వెంటనే కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన చికిత్స కోసం హైదరాబాదులోని గాంధీ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మృతి చెందారు. మృతునికి భార్య, కుమారుడు, కూతురు ఉన్నట్లు గ్రామస్తులు తెలిపారు. బొట్ల సంజీవ్ మృతి పట్ల గ్రామం శోకసంద్రంలో మునిగింది. దేవునిపల్లి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్లు ఎస్సై రాజు తెలిపారు.