calender_icon.png 8 April, 2025 | 1:17 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

07-04-2025 10:16:11 PM

ఇబ్రహీంపట్నం: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందిన సంఘటన ఆదిభట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మధ్యప్రదేశ్ కి చెందిన కైలాష్ ప్రసాద్ (42), గత మూడు నెలల నుంచి తుర్కయంజాల్ మున్సిపాలిటీ పరిధిలోని ఏవీ నగర్ లో గల ఓ డైరీ ఫార్మ్ లో పనిచేస్తూ అక్కడే నివాసం ఉంటున్నాడు. ఆదివారం సాయంత్రం తన స్నేహితుడిని కలిసేందుకు వెళ్లిన ప్రసాద్, తిరిగి వస్తుండగా మార్గం మధ్యలో రాగన్నగూడ ప్రభుత్వ స్కూల్ సమీపంలో రోడ్డు దాటుతుండగా అతివేగంగా వచ్చిన బైక్ ప్రసాద్ ను బలంగా ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో అతనికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు గమనించిన స్థానికులు 108 సాయంతో ఉస్మానియాకు తరలించారు. ఆదివారం రాత్రి చికిత్స పొందుతూ ప్రసాద్ మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. డైరీ ఫార్మ్ యజమాని జొన్నాడ మల్లారెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.